- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం
కొండమల్లేపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన ఇప్ప అంజమ్మ (33) కుటుంబం పాత ఇనుప సామాన్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఇంటి సమీపంలో నివసిస్తున్న కొండపల్లి శ్రీను తమ ఇంటి వద్ద సామాన్లు ఉంచవద్దని చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది.
శుక్రవారం ఉదయం కొండపల్లి శ్రీను, అతని భార్య పుష్పలత, తల్లి ముత్యాలమ్మ కలిసి అంజమ్మ ఇంటి వద్దకు వచ్చి మరోసారి గొడవపడ్డారని, ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంజమ్మ అక్కడే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను దేవరకొండలోని సంజీవని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. బాధితురాలి భర్త ఇప్ప శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.






