- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షూస్ వేసుకుంటుండగానే గుండెపోటుతో యువకుడు మృతి
by Ratna Kumari |
ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, బైంసా : ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని మహారాష్ట్ర రాష్ట్రం పాలజ్ గ్రామానికి చెందిన నరేష్ భువనేశ్వర్ మెంచువార్ (24) గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న నరేష్ శుక్రవారం మధ్యాహ్నం గంగాఖేడ్‌లోని ఓ మెడికల్ షాపులో విధులు నిర్వహించాడు.
అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి షూస్ వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడి వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటన షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువకుడి ఆకస్మిక మరణం స్థానికంగా కలకలం రేపింది.
Next Story






