దృష్టి మరల్చి బంగారు గొలుసులను దొంగిలిస్తున్నపాత నేరస్తుడి అరెస్ట్

by Taduka Kalyani |

అమాయకుల దృష్టి మరల్చి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ముఠా సభ్యుల్లోని ఒక పాత నేరస్తుని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

దృష్టి మరల్చి బంగారు గొలుసులను దొంగిలిస్తున్నపాత నేరస్తుడి అరెస్ట్
X

దిశ, రాజేంద్రనగర్ : అమాయకుల దృష్టి మరల్చి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ముఠా సభ్యుల్లోని ఒక పాత నేరస్తుని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ నాగేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం...మల్లేపల్లి కి చెందిన విశాల్ (25), అతని స్నేహితులు రవి, జహంగీర్, శ్యామ్ సుందర్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2025 అక్టోబర్ 16న గాజుల సతీష్ కుమార్ ఆరాంఘర్ చౌరస్తాలో బస్సు దిగే సమయంలో అతని దృష్టిని మరల్చి నలుగురు నేరస్తులు బంగారు గొలుసును దొంగిలించారు. గాజుల సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఈ నలుగురిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. దొంగిలించిన గొలుసులను విక్రయించి వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేవారు. నలుగురు నిందితుల్లో నుంచి శుక్రవారం ఓ నిందితుడిని అరెస్టు చేశామని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. ముగ్గురు నేరస్తులను పట్టుకునేందుకు స్పెషల్ టీం ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితుడు నుండి నాలుగు తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకుని తరలించినట్లు తెలిపారు.

Next Story