- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కబ్రస్థాన్ ప్రహరీ గోడకు రూ.10 లక్షలు మంజూరు
కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 22వ డివిజన్‌లోని కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర అవసరాల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు.

దిశ, కొత్తగూడెం టౌన్ : కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 22వ డివిజన్‌లోని కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర అవసరాల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి చింతలపూడి పార్వతి ముస్లిం సోదరులకు కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆ సమస్యను అప్పటి కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీ తన నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు.
ఈ మేరకు మంజూరు లేఖను శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ముస్లిం మత పెద్దలకు అందజేశారు. మరో వారం రోజుల్లో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సుజాతనగర్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కబ్రస్థాన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన చింతలపూడి పార్వతికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మసీదు ముతవల్లి, డాక్టర్ అనీష్, లావుడ్యా సత్యనారాయణ, పెద్దమల్ల నరేంద్ర ప్రసాద్, చింతలపూడి జగన్, మండే చంటి, ఎస్‌కే బాబా, ఎస్‌కే బనగీ సాబ్, ఎస్‌కే షర్ఫుద్దీన్, చింతల ప్రదీప్, పులి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






