- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... తల్లీకూతుళ్ల స్పాట్ డెడ్
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. బ్రాహ్మణపల్లె-మద్దూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ వాహనం బలంగా ఢీకొట్టింది...

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. బ్రాహ్మణపల్లె-మద్దూరు(Brahmanapalle- Madduru) ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు గోనవరం గ్రామానికి చెందిన లలితమ్మ (40), ఆమె కుమార్తె లక్ష్మీ (18)గా పోలీసులు గుర్తించారు. తల్లి, కూతురు ఇద్దరూ ఒకేసారి ప్రమాదానికి గురై మరణించడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.






