అర్జున్ దాస్ 'సూపర్ హీరో బాబు' ఫస్ట్ లుక్ రిలీజ్

by Chukka Sudharani |

అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు'.

అర్జున్ దాస్ సూపర్ హీరో బాబు ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు'. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. సూపర్ హీరో లుక్‌లో అర్జున్ దాస్ కనిపిస్తుండగా.. అతని చుట్టూ ఆశ్చర్యకరంగా మిగిలిన వారు నిలబడి ఉండగా ఈ ఇంటెన్స్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీని జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కె.ఎస్. సినిష్ 'సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' బ్యానర్‌పై సమర్పిస్తుండగా 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ తేజు అశ్విని, అర్జున్ దాస్ సీన్స్ హైలెట్ కానున్నాయి. ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'ఖుషి', 'హాయ్ నాన్న', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి భావోద్వేగభరితమైన చిత్రాలకు సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

Next Story