- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్‌లో ఓట్లు మాయం.. వివాదంగా మారిన ప్రక్రియ
వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లె పంచాయతీ పరిధిలోని భోగేపల్లి గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి ఒక్కసారిగా గల్లంతయ్యాయి..

దిశ, ప్రతినిధి కడప: వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నరవకాటిపల్లె పంచాయతీ పరిధిలోని భోగేపల్లి గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి ఒక్కసారిగా గల్లంతయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఓటేస్తున్నామని, 90 ఏళ్లు దాటినా తమకు ఇప్పుడు ఓటు హక్కు లేదనడం దారుణమని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో భాకరాపేటకు నడిచి వెళ్లి ఓటు వేసిన రోజుల నుంచి నేటి వరకు ఎన్నో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నామని, ఓటు లేకపోతే బతికున్నా చనిపోయినట్టే" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గల్లంతైన ఓట్లలో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లే ఉండటం గమనార్హం.ఇది కేవలం ఒక గ్రామ సమస్య కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్రమైన హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. రికార్డుల లోపం జరిగిందా? సాంకేతిక సమస్యా? లేక మరేదైనా కారణమా? అనే దానిపై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.






