- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేబర్ క్యాంపులో గంజాయి విక్రయానికి ప్రయత్నం
రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మై హోమ్ సయుక్ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు గంజాయి పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ,రామచంద్రాపురం : రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మై హోమ్ సయుక్ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు గంజాయి పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బీహార్ రాష్ట్రం నుంచి సుమారు 5.5 కిలోల గంజాయి తీసుకొచ్చి లేబర్ క్యాంపులోని కార్మికులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొల్లూర్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. లేబర్ క్యాంపుల్లో మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లూర్ పోలీసులు హెచ్చరించారు.






