- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిలేరియస్‌గా 'ఓ..! సుకుమారి' ట్రైలర్
టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన 'ఓ..! సుకుమారి' ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

దిశ, సినిమా: టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన 'ఓ..! సుకుమారి' ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఈ రొమాన్స్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు భరత్ దర్శన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. 'శివం భాజే' విజయం తర్వాత గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘దామిని గురించి ఊరంతా భయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే... ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ సమస్యను భార్యాభర్తలు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటుచేసుకున్నాయి? అన్నదే సినిమా ప్రధాన కథాంశం. 'ఓ..! సుకుమారి' ట్రైలర్ కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను కలిపిన వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలను పెంచగా.. భారీ అంచనాల మధ్య జులై 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.






