- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల జాబితా సవరణపై నిర్లక్ష్యం వద్దు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా, బూత్ స్థాయి ఏర్పాట్లు, బీఎల్ఏల పనితీరుపై టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా, బూత్ స్థాయి ఏర్పాట్లు, బీఎల్ఏల పనితీరుపై టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ఎస్‌ఐఆర్ పార్లమెంట్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు పాల్గొని తమ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు.
ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ ఓటును కాపాడుకోవడం పార్టీకి అత్యంత కీలకమని, అందుకోసం బూత్ స్థాయి నుంచి పటిష్టమైన కార్యాచరణ ఉండాలని సూచించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల నమోదు, జాబితా పరిశీలన, అవసరమైన ధృవపత్రాల సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు. బూత్ లెవల్ ఏజెంట్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమన్వయం లోపించకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పనితీరు మందకొడిగా ఉన్న ప్రాంతాల్లో ఇంచార్జ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని నేతలకు పార్టీ నాయకత్వం సూచించింది






