- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థకు ఉత్పత్తి, ఆదాయం
మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్‌లో శుక్రవారం బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు.

దిశ, మందమర్రి : మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్‌లో శుక్రవారం బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు, డీజీఎంఎస్ అధికారులతో కలిసి ఇల్లందు క్లబ్ ఆవరణంలో మొక్కలు నాటి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో సింగరేణి అధికారులు, డీజీఎంఎస్ అధికారులు భద్రతా గీతాలను ప్రదర్శించిన అనంతరం అందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా డీజీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్ మాట్లాడుతూ.. భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కీలక ప్రాంతాల్లో అనుభవజ్ఞులైన ఉద్యోగులను మాత్రమే విధుల్లో నియమించాలని సూచించారు. కార్మికుల వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థకు ఉత్పత్తి, ఆదాయం పెరుగుతాయని అన్నారు. సింగరేణిలో భద్రతా చర్యల విషయంలో యాజమాన్యం ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో భద్రతా నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను విజయవంతంగా సాధిస్తున్నారని కొనియాడారు.
ఈ సమావేశంలో డీజీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్, డీడీఎంఎస్ (మైనింగ్) దీపక్ కుమార్ ప్రభాకర్, డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) కోమల్ చౌదరి, మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం.రమేష్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, గుర్తింపు సంఘాల బ్రాంచ్ కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ, ఎస్.తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ జీఎం (సేఫ్టీ) రఘు కుమార్, జీఎం (రెస్క్యూ) శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ఏరియా ఏజెంట్లు, గని మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, యూనియన్ ప్రతినిధులు, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.






