- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంజనీర్ల శిక్షణలో దేశానికి ఆదర్శంగా ఇస్కీ
ఇంజినీర్ల శిక్షణలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ) దేశానికి ఆదర్శంగా నిలిచిందని డైరెక్టర్ కల్నల్ హర్‌పాల్ సింగ్ గ్రేవల్ తెలిపారు.

- డైరెక్టర్ కల్నల్ హర్‌పాల్ సింగ్ గ్రేవల్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజినీర్ల శిక్షణలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ) దేశానికి ఆదర్శంగా నిలిచిందని డైరెక్టర్ కల్నల్ హర్‌పాల్ సింగ్ గ్రేవల్ తెలిపారు. దేశంలో ఇంజనీరింగ్ రంగం వేగంగా మారుతున్న దశలో రోజురోజుకు వస్తున్న నూతన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ఇంజనీర్లు నిరంతరం తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇన్-సర్వీస్ ఇంజనీర్లకు ఉన్నత స్థాయి వృత్తి శిక్షణ అందించాలనే లక్ష్యంతో 1975లో ఇస్కీ ఆవిర్భావానికి రూపకల్పన జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇస్కీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్నల్ హెచ్ఎస్.గ్రేవల్ మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ సంస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపినప్పటికీ, అప్పటికే బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ, హెచ్‌ఏఎల్, హెచ్‌ఎమ్‌టీ, మిధాని, బీడీఎల్, డీఆర్‌డీఓ, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్‌లో ఉండటంతో ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) ఈ సంస్థను హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించిందన్నారు. సుమారు 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, గ్రౌండ్, మొదటి మరియు రెండో అంతస్తులతో నిర్మించిన ఈ కన్వెన్షన్ సెంటర్‌లో 800 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అత్యాధునిక గ్రాండ్ ఆడిటోరియం, డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్, భారీ హై-డెఫినిషన్ ప్రొజెక్షన్ స్క్రీన్, అత్యాధునిక ఆడియో-విజువల్ సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విశాలమైన పార్కింగ్, ప్రశాంతమైన హరిత వాతావరణం, సులభ రాకపోకలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్‌ను కార్పొరేట్ కార్యక్రమాలు, సదస్సులు, విద్యా కార్యక్రమాలు, ప్రదర్శనలు, సామాజిక వేడుకల నిర్వహణకు అందుబాటు ధరల్లో అద్దెకు అందిస్తున్నామని కల్నల్ హర్‌పాల్ సింగ్ గ్రేవల్ తెలిపారు.






