ఆహార భద్రత ప్రమాణాలు పాటించకపోతే కేసులు తప్పవు

by velandi.Saikiran |

ఘట్‌కేసర్ సర్కిల్‌లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారితో డీసీ వాణి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆహార భద్రత ప్రమాణాలు పాటించకపోతే కేసులు తప్పవు
X

దిశ, ఘట్కేసర్: హోటల్లలో ఆహార భద్రత ప్రమాణాలు పాటించకపోతే కేసులు తప్పవని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) వాణి తెలిపారు. శుక్రవారం ఘట్‌కేసర్ సర్కిల్‌లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారి నీలీషా , ఎస్‌డబ్ల్యూఎం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఈఈ (ఎస్‌డబ్ల్యూఎం) సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నాణ్యమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందించ లక్ష్యంతో ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు డీసీ చెప్పారు.

సర్కిల్ పరిధిలోని టులిప్స్ రెస్టారెంట్, ఆర్ రాయల్ బావర్చి, పరివార్ రెస్టారెంట్, అక్షిత్‌స్ టాండూరి ఫ్యూజన్ ఢాబా లను తనిఖీ చేసి, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంట పాత్రల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించినట్లు తెలిపారు. ఆహార భద్రతా నిబంధనలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని హోటల్ యాజమాన్యాలకు ఆమె సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Next Story