మంటల్లో కాలిపోయిన గుర్తుతెలియని మహిళ

by velandi.Saikiran |

నుస్తులాపూర్ లోని దర్గా వద్ద గుర్తుతెలియని మహిళ మంటల్లో కాలిపోతున్నట్లు వచ్చిన సమాచారం ఆ గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది.

మంటల్లో కాలిపోయిన గుర్తుతెలియని మహిళ
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లోని దర్గా వద్ద గుర్తుతెలియని మహిళ మంటల్లో కాలిపోతున్నట్లు వచ్చిన సమాచారం ఆ గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలు పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నుస్తులాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని మహిళ మంటల్లో కాలిపోతుందన్న సమాచారం మేరకు స్థానికులు అక్కడికి చేరుకొని ఆమెను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిసరాలను పరిశీలించారు. కాగా ఇది ప్రమాదమా..? మరేదైనా కారణమా..? అనేది తెలాల్సి ఉంది. కాగా మృతురాలి ముంజెయి పై 'Raju dattubhai' అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈమెకు సంబందించిన సమాచారం తెలిసిన వారు ఎల్ఎండి పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు.

Next Story