గురుకుల పాఠశాలలో ప్రమాదం.. రెండవ అంతస్తు నుంచి కింద పడిన విద్యార్థిని

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

గురుకుల పాఠశాలలో ప్రమాదం.. రెండవ అంతస్తు నుంచి కింద పడిన విద్యార్థిని
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రంజోల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అక్షర శ్రీ అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు పాఠశాల భవనం రెండవ అంతస్తు నుంచి కిందపడిపోయింది. దీంతో సదరు విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సంగారెడ్డికి రెఫర్..

సమాచారం అందుకున్న పాఠశాల బాధ్యులు తక్షణమే స్పందించి, గాయపడిన అక్షర శ్రీని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించగా.. స్థానిక వైద్యులు బాలికకు అత్యవసరంగా ప్రథమ చికిత్స అందించారు. అయితే, మెరుగైన వైద్య సేవలు కోసం వైద్యుల సూచన మేరకు బాలికను జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది? భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story