- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే
by Taduka Kalyani |
నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.

X
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో నగరాభివృద్ధి నిధులతో చేపట్టనున్న అండర్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే సునీత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఏఈ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్ఛేష్ యాదవ్, కౌన్సిలర్ కండెల రాజు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






