జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం అందించాలి

by velandi.Saikiran |

జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పాసులు అందించాలని హనుమకొండ డిపో మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం అందించాలి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పాసులు అందించాలని శుక్రవారం హనుమకొండ డిపో మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ సభ్యులు చుంచు ఐలయ్య ,టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కన్వీనర్ సాతూరి చంద్రమౌళి ,టి డబ్ల్యూ జె ఎఫ్ ఈసీ మెంబర్ బొల్లంపల్లి శ్రీనివాస్ ,రాంపెల్లి శ్రీనివాస్ , బోలిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story