- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ వల్లే యువతలో క్యాన్సర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరుమీదున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. త్వరలో ‘ది ఇండియా స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.

దిశ, సినిమా : ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరుమీదున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. త్వరలో ‘ది ఇండియా స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను వెలికితీసే ప్రయత్నంగా తెరకెక్కుతోంది. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం ప్రధాన అంశాలుగా రాబోతున్న ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజల్ ఆహారం కల్తిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ మేరకు కల్తీపై అవగాహన కల్పించే భాగంగానే మా ‘ది ఇండియా స్టోరీ’ రాబోతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్‌లో నేను చాలా షాకింగ్ విషయాలు తెలుసుకున్నా. అంతే కాదు ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశా’ అని చెప్పుకొచ్చింది.
- Tags
- kajal aggarwal






