- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి
గ్రామ పంచాయతీ నిధులను ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించాలని, నిధుల దుర్వినియోగం, మళ్లింపు జరిగినట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శుల, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు.

దిశ, నర్సాపూర్ : గ్రామ పంచాయతీ నిధులను ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించాలని, నిధుల దుర్వినియోగం, మళ్లింపు జరిగినట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శుల, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని నర్సాపూర్, తూప్రాన్ డివిజన్‌ల లోని 248 గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులందరితో నర్సాపూర్‌లోని బి వి ఆర్ ఐ టి లో గ్రామ పంచాయతీ అభివృద్ధి సమగ్ర ప్రణాళిక, VBGRAMJI, జల సిరి, OSR, SWM నియమాలు, 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై ఒక రోజు అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య డిఎల్పిఓ తూప్రాన్ డి ఎల్ పి ఓ నర్సాపూర్ తూప్రాన్ మండలాల ఎంపీడీవోలు, సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచ్ లు, వార్డు సభ్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు.
గ్రామ పంచాయతీలకు లభించే 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, వి బి జి రామ్ జీ పథకం తదితర వనరులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జంతు పునరుత్పత్తి నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పశు వైద్య శాఖ ద్వారా శస్త్రచికిత్సలు, యాంటీ రేబిస్ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, గ్రామ పంచాయతీలు కుక్కలను పట్టుకోవడం, సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఉపాధి హామీ, విబి జి రామ్ జీ పథకాల క్రింద చేపట్టిన పనులకు చెల్లింపులు నిర్ణీత గడువులో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా సంఘాల భవనాలు, ఇతర ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన భూమి, పరిపాలనా అనుమతులు జిల్లా యంత్రాంగం నుంచి అందజేస్తామని తెలిపారు. 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు కూరగాయల సాగు కోసం పందిళ్ల ఏర్పాటు, బీటీ రహదారులు, మ్యాజిక్ డ్రైన్లు, సౌర విద్యుత్ ఆధారిత వీధి దీపాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






