‘త్రిముఖ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మూవీ టీమ్

by I. Sairam |   (  Updated:2026-01-16 04:44:08  IST  )

సన్నీలియోన్(Sunny Leon) మెయిన్ లీడ్‌లో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి(Sridevi Maddali), రమేష్ మద్దాలి(Ramesh Maddali) నిర్మాణంలో రాజేష్ నాయుడు(Rajesh Naidu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’(Trimukha).

‘త్రిముఖ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: సన్నీలియోన్(Sunny Leon) మెయిన్ లీడ్‌లో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి(Sridevi Maddali), రమేష్ మద్దాలి(Ramesh Maddali) నిర్మాణంలో రాజేష్ నాయుడు(Rajesh Naidu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’(Trimukha). యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, అషు రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సాహితీ, సూర్య, జీవా, జెమిని సురేష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఎప్పటినుంచో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘త్రిముఖ’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More..

మెగా ప్రిన్స్ VT-15 టైటిల్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే.. ట్వీట్ వైరల్

Next Story