- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ప్రిన్స్ VT-15 టైటిల్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే.. ట్వీట్ వైరల్
సరైన హిట్ లేక ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej).

దిశ, వెబ్‌డెస్క్: సరైన హిట్ లేక ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej). ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీటీ-15’(VT-15). మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఇందులో భాగంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను జనవరి 19న రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు కమెడియన్ సత్యతో ఓ ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఏంటి ఇన్ని డైలాగులు ఉన్నాయి నాకు అంటూ సత్య కంగారు పడుతూ కనిపించారు. అలాగే కొరియా భాషలో ఉన్న డైలాగ్‌ను చూసి కొరియన్స్‌కు వీడియో కాల్ చేసిన ఫన్నీ ఆడియన్స్‌కు తెగ నవ్వులు తెప్పిస్తుంది.
ఆ తర్వాత వరుణ్ తేజ్ ఫోన్ చేసి ఆ డైలాగ్ గురించి ఆరా తీస్తాడు. అలా ఈ వీడియో అభిమానులకు ఫుల్ కామెడీని పంచుతుంది. కాగా ఈ మూవీ కథ కొరియన్ నేపథ్యంలో సాగనుండటంతో ఈ మూవీ టైటిల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.
Read More..






