- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేణు "ఎల్లమ్మ" గ్లింప్స్.. అదరగొట్టిన DSP ఫస్ట్ లుక్
"ఎల్లమ్మ"లో దేవిశ్రీ ఫస్ట్ లుక్ విడుదల అయింది.

దిశ, వెబ్ డెస్క్ : కామెడీ నటుడు వేణు ఎల్దండి డైరెక్టర్ గా మారి, తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీసిన "బలగం" సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా రెండేళ్ల తర్వాత వేణు రెండో సినిమాపై నేడు కీలక ప్రకటన బయటికి వచ్చింది. "ఎల్లమ్మ" టైటిల్ తో తన రెండవ సినిమా పట్టాలకెక్కినట్టు వేణు ప్రకటించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ నటిస్తున్నారు. నేడు డీఎస్పీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తోపాటు, సినిమా గ్లింప్స్ విడుదల చేసారు. 'ఎల్లమ్మ'లో దేవీ 'పార్శీ' పాత్రలో కనిపించనుండగా.. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ అదరగొట్టింది.
తెలంగాణలో 'రేణుకా ఎల్లమ్మ'ను ప్రధాన దేవతగా కొలుస్తుంటారు. ఈ సినిమా కూడా ఎల్లమ్మ చుట్టూ తిరగనుందని గ్లింప్స్ లో తెలుస్తోంది. ఇప్పటివరకు తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీస్పీ నటనలో ఎలా మెప్పిస్తారో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవీనే ఇస్తున్నాడు.






