పాపను ఎత్తుకొని కనిపించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

by I. Sairam |   (  Updated:2026-01-31 05:24:01  IST  )

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పాపను ఎత్తుకొని కనిపించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ మూవీలో యాక్ట్ చేస్తోంది.

ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి తెలుపుతూ ఈ భామ నిత్యం ఫాలోవర్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో కొన్ని రెడీ అయిన ఫొటోస్‌తో పాటు కుకింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అంతేకాకుండా ఒక చిన్న క్యూట్ పాపను ఎత్తుకున్న ఫొటో కూడా పంచుకుంది. ఇక వీటికి.. ‘ఇంకా ఈ రుచికరమైన బోండాల గురించి కలలు కంటున్నాను.. @aathitiyan మరియు నా @cookdtv ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపాను’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సరైన ఆఫర్లు లేక వంటల షోస్‌కు వెళ్తుందా అని చర్చించుకుంటున్నారు.

Read More..

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ సెక్సీ డ్రెస్‌లో నా బాడీ చూడాలన్నాడు.. ఐశ్వర్య రాజేష్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)


Next Story