Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ సెక్సీ డ్రెస్‌లో నా బాడీ చూడాలన్నాడు.. ఐశ్వర్య రాజేష్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-31 02:16:39  IST  )

ఆ డైరెక్టర్ నా బాడీ చూడాలని అన్నాడు..టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)

Aishwarya Rajesh: ఆ డైరెక్టర్ సెక్సీ డ్రెస్‌లో నా బాడీ చూడాలన్నాడు.. ఐశ్వర్య రాజేష్ సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించి తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను రాబట్టుకుంది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఏడాది పాటు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తోలుగులో వరుస చాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం తిరువీర్ సరసన ‘ఓ సుకుమారి’ (O Sukumari)మూవీలో నటిస్తోంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మహేశ్వరరెడ్డి మాలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇక ఈక్రమంలో.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఐశ్వర్య రాజేష్ పలు షాకింగ్ విషయాలు పంచుకుంటూ.. వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో నేను ఒక సినిమా అడిషన్స్‌కి వెళ్లాను. ఆ డైరెక్టర్ నన్ను సెక్సీ బట్టలు.. నైట్ డ్రెస్సులో కనిపించు అన్నాడు. ఎందుకంటే.. అతను నా బాడీ చూడాలని అన్నాడు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడు అని తర్వాత అనుకున్నాను. ఆ తర్వాత చాలా బాధపడ్డాను. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.

ఈ డ్రెస్ వేసుకోకు అని ఎవరైనా అంటే నువ్వు ఏం చేస్తావు యాంకర్ ప్రశ్నించగా.. నేను అలా చెప్తే నిజంగానే వాళ్లు చెప్పిన బట్టలే వేసుకునేలా మారిపోతాను. కానీ అకేషన్ బట్టి నేను దుస్తులు ధరిస్తాను. ఇతరుల విషయంలో నేను అలాంటివి పట్టించుకోను వాళ్లకు కంఫర్ట్ ఉన్నవి వేసుకుంటారని అనుకుంటా అని సమాధాన మిచ్చింది. అలాగే తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని చెప్పి ఏడ్చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story