టాలీవుడ్‌కు మరో హీరోయిన్ దొరికేసిందోచ్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల

by I. Sairam |   (  Updated:2026-01-19 07:04:19  IST  )

దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara).

టాలీవుడ్‌కు మరో హీరోయిన్ దొరికేసిందోచ్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Akasamlo Oka Tara). దర్శకుడు పవన్ సాదినేని(Pawan Sadineni) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లు సమర్పిస్తుండగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక దీనికి జి.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ఇక సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి తెలుగు హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా .. ‘ఆమె ఆకాశం కంటే పెద్ద కలను మోస్తుంది.. ఆకాశంలో ఒక తారకు రెక్కలు ఇచ్చే కలలు కనే సాత్విక వీరవల్లిని పరిచయం చేస్తున్నాము ’ అని రాసుకొస్తూ ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక పోస్టర్‌లో హీరోయిన్ సాత్విక లంగా ఓణీ కట్టుకొని పెద్ద పెద్ద కళ్లతో, మెడలో నల్ల పూసలు, పసుపుతాడు, నుదుటన బొట్టు పెట్టుకొని రైల్లో ఓ సీటులో కూర్చొంది. చూడటానికి చాలా సంప్రదాయ గృహిణిగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

ఒకే మూవీలో తనతో పాటు తన కో హీరోయిన్‌కు కూడా డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా..?


Next Story