- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే మూవీలో తనతో పాటు తన కో హీరోయిన్‌కు కూడా డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్(Nithya Menon) ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్(Nithya Menon) ఒకరు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ‘అలా మొదలైంది’ నుంచి ‘భీమ్లా నాయక్’ వరకూ విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా తమిళ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి ‘సార్ మేడమ్’ అనే చిత్రం చేసింది.
ఇదిలా ఉంటే.. ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నితిన్(Nithin) నటించిన ‘గుండెజారి గల్లంతైంది’(Gundejari Gallanthaindi) మూవీలో తన క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఈ మూవీలో సెకెండ్ హీరోయిన్ ఇషా తల్వార్(Isha Thalwar) క్యారెక్టర్‌కి కూడా ఈ ముద్దుగుమ్మనే డబ్బింగ్ చెప్పిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..






