- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హరి హర వీరమల్లు’ పార్ట్-2 పేరు ఇదే.. పవన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ బ్రో సినిమా తర్వాత హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో HHVM భారీ అంచనాలతో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ‘వీరమల్లు’ పాత్రలో నటిస్తున్నారు. కథానాయికగా నిధి అగర్వాల్. ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో 16 శతాబ్దానికి చెందిన మొగల్ పాలనను ప్రతిబింబించేలా భారీ దర్బార్ సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ దర్బారు సెట్‌లో ఔరంగజేబు, వీరమల్లు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీ విడుదల సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మరో శుభవార్త అందింది. హరిహర వీరమల్లు పార్ట్-2కి సంబంధించి ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హరిహర వీరమల్లులో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు ఢిల్లీ బయలుదేరగా.. అడ్డుకునేందుకు ఔరంగజేబు సిద్ధమవుతారు. ఇక, వీరమల్లు, ఔరంగజేబు కలుసుకోవడంతోనే మూవీని ముగించారు. అంతేకాకుండా సినిమా చివర్లో ‘యుద్ధభూమి’ అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్–2 పై అంచనాలు పెంచారు. హైందవ ధర్మ పరిరక్షణ, కోహినూర్‌ను దక్కించుకనే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు హరిహర వీరమల్లు పార్ట్–2 లోనే ప్లాన్ చేసినట్లు సమాచారం.
Read More..






