హరిహర వీరమల్లు సినిమాపై హైపర్ ఆది రివ్యూ

by Malleboina Mahesh |   (  Updated:2025-07-24 04:07:08  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

హరిహర వీరమల్లు సినిమాపై హైపర్ ఆది రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. స్టార్ హీరో కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్, బెన్ ఫిట్ షో లకు ప్రభుత్వాలు అనుమతించాయి. దీంతో నిన్న రాత్రి నుంచి థియేటర్ల వద్ద పవన్ అభిమానులు (Pawan fans) సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ అభిమానుల్లో ఒకడైన జబర్ధస్థ్ నటుడు హైపర్ ఆది (Jabardasth actor Hyper Aadi).. సినిమా చూసిన తర్వాత ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశాడు.

అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా అద్బుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్లు, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని, అభిమానులకు నచ్చే విధంగా సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రతి సీన్ చాలా కేర్ తీసుకుని ఈ సినిమాను చేశారని ఆది అన్నారు. ఆఫ్ స్క్రీన్‌లో ధర్మం కోసం పోరాడిన పవన్‌ని చూశారు. అలాగే ఆన్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమల్లును చూసి ఎంజాయ్ చేయండని హైపర్ ఆది.. హరిహర వీరమల్లు సినిమాపై హైప్ పెంచాడు. కాగా మరికొద్ది సేపట్లో ఈ సినిమాపై ఒరిజినల్ రివ్యూ రానుంది.

Read More..

హరిహర వీరమల్లు రిలీజ్.. ఆ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ!

Next Story