హరిహర వీరమల్లు రిలీజ్.. ఆ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ!

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-24 04:11:43  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈ రోజు(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది

హరిహర వీరమల్లు రిలీజ్.. ఆ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈ రోజు(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ మేరకు మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు కావడంతో మళ్లీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ నేపథ్యంలో కొన్ని థియేటర్ల వద్ద పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు వీరంగం సృష్టించారు.

నిన్న(బుధవారం) రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలు వేశారు. భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఏపీలోని మచిలీపట్నంలో రేవతి థియేటర్ వద్ద ఫ్యాన్స్ అర్ధరాత్రి రచ్చరచ్చ చేశారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ.. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తోసుకుంటూ థియేటర్‌లోకి చొచ్చుకుపోయారు. దీంతో థియేటర్ ఎంట్రన్స్ గేటు గ్లాస్ ధ్వంసమైంది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు వాటర్ క్యాన్లతో దాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అదుపు చేయలేక లాఠీలకు పని చెప్పారు. ఇకపోతే.. కడప నగరంలోని రాజా థియేటర్ వద్ద కూడా పవన్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. బైక్ సౌండ్స్‌తో రచ్చ రచ్చ చేశారు. బైకుల సైలెన్సర్లు తీసి బైక్ రైడింగ్ తో హంగామా చేశారు. ఈ తరుణంలో ఇరువర్గాలుగా విడిపోయిన పవన్ ఫ్యాన్స్ కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి

Read More..

'హరిహర వీరమల్లు' పబ్లిక్ టాక్.. పవన్ కళ్యాణ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?

Next Story