- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'హరిహర వీరమల్లు' పబ్లిక్ టాక్.. పవన్ కళ్యాణ్ ఖాతాలో హిట్ పడినట్టేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) నేడు థియేటర్లలో రిలీజ్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna)లు తెరకెక్కించిన ఈ మూవీని భారీ నిర్మాణాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(AM Rathnam) నిర్మించారు. ఇక ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటించింది. అయితే గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం.. హరిహర వీరమల్లు సినిమా చారిత్రక కథను డైరెక్టర్ లిద్దరూ బాగా చూపించారని చెప్పుకొస్తున్నారు.
అలాగే మూవీ తమకు ఎక్కడా బోర్ కొట్టలేదని.. కీరవాణి మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలెట్ అని అంటున్నారు.. పార్ట్1లో ప్రతీ క్యారెక్టర్‌ని కూడా మొదటి నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా డిజైన్ చేసి చూపించారని, పార్ట్ 2లో ఈ పాత్రలకి సంబంధించి ప్రతీదానికి వివరణ ఉంటుందని అంటున్నారు. పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయినట్లు కామెంట్ చేస్తున్నారు. అలా ఇప్పటివరకు ఈ సినిమాకి సోషల్ మీడియాలో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
Read More..
‘హరి హర వీరమల్లు’ పార్ట్-2 పేరు ఇదే.. పవన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా!






