- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లల పేర్లకు అర్థాలు ఇవే..!
చరణ్ ఉపాసన జంట ఇటీవల కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా వారిలో అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్విరా దేవిగా పెట్టినట్లు రామ్ చరణ్ తెలియజేశాడు. శివరామ్ అంటే శివుడు మరియు రాముడు అని, అన్విరా దేవి అంటే శక్తివంతమైన లేదా అన్వేషణ చేసే దేవత అని అర్థం వస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహం 2012వ సంవత్సరం జూన్ 14వ తేదీన ఉపాసనతో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదటి సంతానం కలగడానికి చాలా సమయం పట్టింది. 2023వ సంవత్సరం జూన్ 20వ తేదీన ఈ దంపతులకు మొదటి సంతానం కలిగింది. వీరికి మొదట ఆడబిడ్డ జన్మించింది. ఆ అమ్మాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఈ జనవరి 31వ తేదీన ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ కవల పిల్లల్లో ఆడ మరియు మగ బిడ్డ జన్మించారు.
సెలబ్రిటీలకు పిల్లలు పుట్టిన సమయంలో వారికి ఎలాంటి పేర్లు పెడతారా అని, వాటికి ఎలాంటి అర్థం వస్తుందో జనాలు తెలుసుకోవాలి అనుకుంటారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమకు జన్మించిన కవల పిల్లలకు ఇప్పటికే పేర్లను పెట్టారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తెలియజేశాడు. రామ్ చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు జన్మించిన కవల పిల్లల్లో అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్విరా దేవిగా పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. శివరామ్ అంటే శివుడు మరియు రాముడు అని అర్థం వస్తుంది.
ఇది శుభప్రదమైనది మరియు శివునికి ప్రియమైనవాడు అని కూడా సూచిస్తుంది. ఈ పేరు సంస్కృత మూలాలను కలిగి ఉంది. రాముడిని శివుని అవతారంగా వర్ణిస్తుంది. అన్విరా దేవి అనే పేరుకు అర్థం శక్తివంతమైన లేదా అన్వేషణ చేసే దేవత అని, అన్విరా అంటే అన్వేషణ లేదా వెతకడం అని మరియు దేవి అంటే దైవిక శక్తి లేదా దేవత అని అర్థం వస్తుంది. ఇది పవిత్రత మరియు బలాన్ని కూడా సూచిస్తుంది. సంస్కృతం నుండి ఉద్భవించిన ఈ పేరు తరచుగా అమ్మవారికి ప్రతీకగా పరిగణించబడుతుందని అర్థం వస్తుంది.






