బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పూర్ణ

by Mallepaka Hamsa |

నటి పూర్ణ (poorna)తన మాతృత్వపు మధుర క్షణాలను మరోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పూర్ణ
X

దిశ, సినిమా: నటి పూర్ణ (poorna)తన మాతృత్వపు మధుర క్షణాలను మరోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె రెండోసారి గర్భం దాల్చి, సీమంతం వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనదైన నటనతో అలరించిన నటి పూర్ణ, 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీ(Shahid Asif Ali)ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే ఒక బాబు (హమ్దాన్) ఉండగా, ఇప్పుడు ఆమె రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా జరిగిన తన సీమంతం వేడుకలో పూర్ణ పింక్ కలర్ గౌను ధరించి మెరిసిపోయింది. ఈ గౌను వెనుక ఒక అందమైన జ్ఞాపకం ఉందని ఆమె గుర్తుచేసుకుంది. తన భర్త మొదటిసారి "ఐ లవ్ యూ" అని చెప్పిన రోజు ఈ గౌనును బహుమతిగా ఇచ్చారని, అది ఎన్నాళ్లుగానో అల్మారాలో దాచుకున్నానని, నేడు తన మాతృత్వపు సంబరంలో అది మళ్ళీ నవ్విందంటూ ఎమోషనల్ అయ్యింది.

భర్తపై ప్రేమ.. పిల్లలపై గర్వం ఈ వేడుకను ఒక కల కంటే అందంగా మార్చిన తన భర్తకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే, తన డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్న పిల్లల గురించి కూడా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. వారు తన జీవితంలో ప్రతి అడుగులో ఆనందాన్ని నింపుతున్నారని, వారి ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ రోజంతా పూల వలె తన జ్ఞాపకాల్లో పదిలంగా ఉండిపోతుందని పూర్ణ రాసుకొచ్చింది. బేబీ బంప్ ఫొటోలు సీమంతం వేడుకలో పూర్ణ తన భర్త ,బాబుతో కలిసి దిగిన ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. బేబీ బంప్‌తో ఆమె ఎంతో కళగా కనిపిస్తున్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story