- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు.. ‘లెనిన్’ థర్డ్ సింగిల్ విడుదల
‘సోల్ ఆఫ్ లెనిన్’ పేరుతో మూడో పాటను విడుదల చేశారు. ఈ పాట ఎమోషనల్‌గా సాగుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

దిశ, సినిమా: మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ మళ్లీ ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించనుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 26న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ జోరు పెంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా.. ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘సోల్ ఆఫ్ లెనిన్’ పేరుతో మూడో పాటను విడుదల చేశారు. ఈ పాట ఎమోషనల్‌గా సాగుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ముఖ్యంగా ఈ సాంగ్ విడుదల చేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’’ అనే ఆసక్తికరమైన లైన్‌ను జోడించడంతో, సినిమాలో ప్రేమ ,యాక్షన్ అంశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత అఖిల్ పక్కా మాస్ అండ్ క్లాస్ సబ్జెక్ట్‌తో వస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






