లెనిన్ థర్డ్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్

by Pulgam srinivas |

‘లెనిన్’ మూవీ మూడో సింగిల్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ ను ఈరోజు సాయంత్రం 4:06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

లెనిన్ థర్డ్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించడంతో మూవీపై హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాటకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

‘సోల్ ఆఫ్ లెనిన్’ పేరుతో రాబోతున్న ఈ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 4:06 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అఖిల్–భాగ్యశ్రీ ఒకరినొకరు చూసుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. వరుస అపజయాలతో సతమతమవుతున్న అఖిల్ ఈ సినిమాతో బలమైన కం బ్యాక్ ఇస్తాడని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




Next Story