- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా గౌరవానికి భంగం కలిగించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ నటి పోస్ట్
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న డిజిటల్ ఆధారాలను మొత్తం తాను సేకరించి భద్రపరిచానని, నిందితులను అస్సలు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో ఏఐ టెక్నాలజీని జనాలు ఎంతలా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు కేటుగాళ్లు కొంతమంది సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ, వారి ఫొటోలను ఇష్టానుసారంగా మార్ఫింగ్ చేయడం ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల చిత్రాలను అసభ్యకరంగా మార్చి ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పటికే పరిశ్రమకు చెందిన చాలామంది హీరోయిన్లు ఈ డీప్‌ఫేక్ బారిన పడగా.. తాజాగా ఆ లిస్ట్‌లోకి మలయాళ బ్యూటీ అన్నా రాజన్ చేరారు. తన ఫొటోలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నా రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నిందితులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన ఇమేజ్‌ను కావాలనే దెబ్బతీయడానికి, తనను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కుట్రపూరితంగా ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం చాలా సిగ్గుచేటు అని, ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం తగదని ఆమె ఎమోషనల్ అయ్యారు.
నెటిజన్లు ఎవరూ కూడా ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను షేర్ చేయవద్దని, సపోర్ట్ చేయవద్దని ఆమె కోరారు. కేరళ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్స్‌తో పాటు సైబర్‌డోమ్ కేరళను ట్యాగ్ చేస్తూ.. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న డిజిటల్ ఆధారాలను మొత్తం తాను సేకరించి భద్రపరిచానని, నిందితులను అస్సలు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చట్టపరమైన చర్యల ద్వారా ఈ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ల పని పట్టే వరకు తాను ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు పెట్టే అకౌంట్లపై చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్షలు పడాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా రాజన్ ప్రస్తుతం కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ లో నటిస్తున్నారు. సంచలన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ రజినీకాంత్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ భారీ సీక్వెల్ సినిమాతోనే అన్నా రాజన్ తమిళ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం.






