రాష్ట్రంలో అభయ కార్యక్రమం ప్రారంభం.. మహిళలకు కీలక సూచనలు

by Vemula.Srinu Prasad |

మహిళల భద్రతకు ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మహిళలకు పూర్తి రక్షణ వలయాన్ని కల్పిస్తోంది. ‘మీ భద్రత-మా బాధ్యత’ పేరుతో అభయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..

రాష్ట్రంలో అభయ కార్యక్రమం ప్రారంభం.. మహిళలకు కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల భద్రతకు ఏపీ పోలీసులు(Ap Police) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మహిళలకు పూర్తి రక్షణ వలయాన్ని కల్పిస్తోంది. ‘మీ భద్రత-మా బాధ్యత’ పేరుతో అభయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు అత్యవసర సమయాల్లో 112 నెంబర్‌కు, హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు, వాట్సప్ హెల్ప్ లైన్ 799348511కు కాల్ చేసేందుకు వీలుగా ఈ అభయ కార్యక్రమాన్ని రూపొందించారు.

హోంమంత్రి కీలక పిలుపు

ఈ మేరకు అనకాపల్లిలో అభయ కార్యక్రమాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. వేంపాడు టోల్ ప్లాజా దగ్గర అభయ ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలకు ధైర్యం కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. శక్తి యాప్, టీమ్స్‌తో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాల పట్ల అందరూ అలర్ట్‌గా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.

Next Story