- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనాల వైన్ షాప్‌లో అర్ధరాత్రి చోరీ
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని సిరి వైన్ షాప్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని సిరి వైన్ షాప్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాప్‌కు చెందిన రెండు షట్టర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి నగదు, మద్యం సీసాలను అపహరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, షాప్‌కు ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.65 వేల విలువైన మద్యం సీసాలతో పాటు కౌంటర్‌లో ఉన్న రూ.35 వేల నగదును దొంగిలించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న బోథ్ ఎస్సై పురుషోత్తం బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం, జాగిలాల సాయంతో ఆధారాల కోసం గాలింపు చేపట్టి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల సోనాల మండల కేంద్రంలో వరుసగా దొంగతనాల ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో తలుపులు, తాళాలు సక్రమంగా వేసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.






