- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ నినో ప్రభావం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు.

దిశ, పాల్వంచ రూరల్ : ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. బుధవారం పాల్వంచ మండలంలోని పేట చెరువును సందర్శించిన ఆయన చెరువులోని నీటి నిల్వలు, పరిసర వ్యవసాయ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడుతూ పూర్తిగా వర్షాల పై ఆధారపడే పంటలకు బదులుగా తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటించడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాగు నీటిని పొదుపుగా వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ఆధునిక వ్యవసాయ విధానాల పై మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ ద్వారా నిరంతరం అందుబాటులో ఉంచుతామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం వ్యవసాయ అధికారి శంభో శంకర్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.






