సీఎం విజయ్ కీలక ప్రతిపాదన.. ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

by Kema Shiva Kumar |

తమిళనాడు ప్రభుత్వం చేసిన కీలక అభ్యర్థనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం విజయ్ కీలక ప్రతిపాదన.. ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం విజయ్‌కి కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు రోజురోజుకు మెరుగవుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఎం.సాయి కుమార్ (Sai Kumar) పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ (DoPT) ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 1990 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం.సాయి కుమార్ ప్రస్తుత పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం జూన్ 3న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, ఏఐఎస్ (DCRB) నిబంధనల మేరకు సాయికుమార్ పదవీ కాలం పొడిగింపునకు ఆమోదం తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఆయన 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు మరో 6 నెలల పాటు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

Next Story