విశాఖ బీచ్‌లో ఐదుగురికి తప్పిన పెను ప్రమాదం

by Vemula.Srinu Prasad |

విశాఖ ఆర్కే బీచ్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సముద్రస్నానం కోసం వెళ్లిన పర్యాటకులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. అయితే అక్కడే ఉన్న రక్షక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని కాపాడారు. ...

విశాఖ బీచ్‌లో ఐదుగురికి తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఆర్కే బీచ్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. సముద్రస్నానం కోసం వెళ్లిన పర్యాటకులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. అయితే అక్కడే ఉన్న రక్షక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని కాపాడారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు యాత్రికులు సరదాగా గడిపేందుకు వైజాగ్ బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే సముద్రంలో దిగి స్నానాలు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి వారు నీటిలో కొట్టుకుపోయారు. ఒడ్డుకు రాలేక లోపలికి లాక్కెళ్తుండడంతో ప్రాణాల కోసం వారు తీవ్రంగా పోరాడారు. అయితే పర్యాటకులు గల్లంతవ్వడాన్ని తీరంలో ఉన్న లైఫ్ గార్డ్స్ గమనించారు. ఏమాత్రం వెంటనే రంగంలోకి దిగి అత్యంత సాహసోపేతంగా సముద్రంలోకి వెళ్లి ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమయానికి లైఫ్ గార్డ్స్ స్పందించడంతో ఐదుగురు పర్యాటకులు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు.

Next Story