- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
సీబీఐ వద్దని, జూడిషియల్ ఎంక్వైరీ వద్దని అంటున్నారని, మరి సిట్ ఎం చేస్తుందో తాము చూస్తామని గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ అన్నారు. సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకుంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేయడంపై ఆమె స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: సీబీఐ వద్దని, జూడిషియల్ ఎంక్వైరీ వద్దని అంటున్నారని, మరి సిట్ ఎం చేస్తుందో తాము చూస్తామని గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ అన్నారు. సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకుంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేయడంపై ఆమె స్పందించారు. తాము చెప్పింది వినండని సాయి కృష్ణ కేసులో సిట్, గవర్నమెంట్ అంటోందని తెలిపారు. తాము సామాన్యులమని ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారని ఆరోపించారు. సాయి కృష్ణ కేసులో విజయలక్ష్మి తప్పుకున్నా తాను పోరాటం చేస్తానని కనకదుర్గ హెచ్చరించారు.
మా అక్క విజయలక్ష్మికి ఒత్తిళ్ళు
‘‘మా అక్క విజయలక్ష్మికి ఒత్తిళ్ళు ఉన్నాయి. ఏమో అందుకే మానవ హక్కుల కమిటీ వద్దని కోర్టుకు చెప్పింది. నాకు కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వెళ్లారు. ఒత్తిళ్ళ వల్ల అడ్వకెట్స్‌ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకొని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయి కృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా నేను పిన్నిగా సాయి కృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం.’’ అని కనకదుర్గ హెచ్చరించారు.






