కాంతమ్మ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం : తమ్మినేని వీరభద్రం

by Batti.Sumithra |

సీపీఎం పార్టీ సభ్యురాలు, గృహిణిగా గ్రామంలో విశిష్ట సేవలందించిన పెరుమాళ్లపల్లి కాంతమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

కాంతమ్మ ఆశయ సాధనకు ఉద్యమిద్దాం : తమ్మినేని వీరభద్రం
X

దిశ, ఖమ్మం రూరల్ : సీపీఎం పార్టీ సభ్యురాలు, గృహిణిగా గ్రామంలో విశిష్ట సేవలందించిన పెరుమాళ్లపల్లి కాంతమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆరెంపుల గ్రామానికి చెందిన సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు, సీఐటీయూ జిల్లా నాయకుడు పెరుమాళ్లపల్లి మోహన్‌రావు సతీమణి కాంతమ్మ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందగా, బుధవారం గ్రామంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నంద ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కాంతమ్మ మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని అన్నారు. పార్టీ సభ్యురాలిగా గ్రామ ప్రజల కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఆమె ఆశయాలను కొనసాగించడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు బండి రమేష్ మాట్లాడుతూ కాంతమ్మ గృహిణిగా కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలిచారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కళ్యాణ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబాన్ని చక్కగా నడిపించడంతో పాటు మోహన్‌రావు రాజకీయ జీవితానికి కాంతమ్మ ఎంతో అండగా నిలిచారని గుర్తుచేశారు. సంతాప సభలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు మధు, జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్, జిల్లా నాయకులు షేక్ బషీరుద్దీన్, చలమాల విఠల్, ఉపేందర్, మంగా, దోనోజు లక్ష్మణాచారి, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి సదానందం, ఐద్వా డివిజన్ కార్యదర్శి పెండ్యాల సుమతి, మండల కార్యదర్శి ఏటుకూరి పద్మ తదితరులు ప్రసంగించి కాంతమ్మ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి బండి పద్మతో పాటు పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Next Story