- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదక ద్రవ్యాల వ్యసనం వల్ల యువతకు తీరని నష్టం : విజయేందర్ రెడ్డి
మాదక ద్రవ్యాల వ్యసనం సమాజానికి , ముఖ్యంగా యువత భవిష్యత్తుకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.

దిశ,మేడ్చల్ బ్యూరో : మాదక ద్రవ్యాల వ్యసనం సమాజానికి , ముఖ్యంగా యువత భవిష్యత్తుకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నిర్మూళనకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ విసి హాల్ లో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్య నిర్మూలన సమావేశానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని అందులో భాగంగా సంక్షేమ శాఖల అధికారులు ప్రతి నెల బాలుర హాస్టల్స్ లో అవగాహాన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై వైద్య శాఖ వారు తగినవిధంగా అవగాహాన కల్పించాలని అవసరమైన మేరకు వైద్య సదుపాయం కల్పించాలన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖాధికారి వినోద్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి పద్మజా, డ్రగ్ ఇన్స్పేక్టర్ మౌనిక, అడిషనల్ డిసిపిలు కుత్బుల్లాపూర్ పురుషోత్తం, కూకట్ పల్లి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.






