సైనిక్‌పురిలో ఇంటి చోరీ.. బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరణ

by Taduka Kalyani |

సైనిక్‌పురిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో దుండగులు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు.

సైనిక్‌పురిలో ఇంటి చోరీ.. బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరణ
X

దిశ, కాప్రా: సైనిక్‌పురిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో దుండగులు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుషాయిగూడ ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురిలో నివాసముండే ఆయేషా అతియా జాకీ కుటుంబంతో కలిసి ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లోని మహో ప్రాంతంలో ఉంటున్న తన కుమారుడు మేజర్ జనరల్ ఎం. ఖలీద్ జాకీ వద్దకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి వెళ్లే ముందు తనకు పరిచయం ఉన్న పదవీ విరమణ పొందిన నాయబ్ సుబేదార్ యూనస్ మహమ్మద్ పాషాను ఇంటి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు కేర్‌టేకర్‌గా నియమించారు. ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయేషా అతియా జాకీ ఇంటిని పరిశీలించగా.. బీరువాలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 14న కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి కేర్‌టేకర్‌తో పాటు గతంలో ఇంట్లో పనిచేసిన వారిపై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంటి పరిసరాల్లోని వివరాలు, అనుమానితుల కదలికలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

Next Story