- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినీల అభిమానానికి మురిసిన సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు చూపిన అభిమానానికి మురిసిపోయారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/కొత్తకోట: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు చూపిన అభిమానానికి మురిసిపోయారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బాలికల పాఠశాల భావన ప్రారంభోత్సవానికి బుధవారం ముఖ్యమంత్రి హాజరయ్యారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి హెలిపాడ్ వద్ద స్వాగతం పలికిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు పోటీపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కరచాలనం చేశారు. కరచాలనం చేయడానికి.. మాట్లాడడానికి విద్యార్థినీలు పడిన తాపత్రయానికి ముఖ్యమంత్రి ఒరిసిపోయి.. ఓపికగా అందరితో కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీల ప్రసంగాన్ని సైతం ముఖ్యమంత్రి ఆసక్తిగా విన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాఠశాలకు వచ్చి, స్వయంగా కరచాలని చేసి మాట్లాడడంతో విద్యార్థినీలు, అధ్యాపకులలో నూతన ఉత్సాహం నెలకొంది.






