యూకేలో తెలుగు సినిమా ప్రమోషన్స్.. సందడి చేసిన "ఎపిక్" జంట

by Chukka Sudharani |

‘బేబి’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో క్రేజీ జంటగా మారారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య.

యూకేలో తెలుగు సినిమా ప్రమోషన్స్.. సందడి చేసిన ఎపిక్ జంట
X

దిశ, సినిమా: ‘బేబి’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో క్రేజీ జంటగా మారారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఇప్పుడు వీరిద్దరి "ఎపిక్" అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తమ సినిమాను లండన్‌లో ప్రమోట్ చేసుకుంటున్నారు ఆనంద్, వైష్ణవి. ఈ మేరకు లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక తెలుగు పీజెంట్‌లో సెలబ్రిటీ గెస్ట్‌లుగా ఆనంద్, వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘ఎపిక్’ చిత్రంలోని పాటలకు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు వారితో కలిసి వీరిద్దరు స్టెప్పులేసి అక్కడ వారిని ఆనంద పరిచారు. లండన్ వాసి తెలుగు నటుడు నిర్మాత యష్ రంగినేని, యూకే పార్లమెంట్ లార్డ్ ఉదయ్ నాగరాజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మన సంప్రదాయం, ప్రతిభను చాటేలా ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. కాగా.. ‘90స్’ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Next Story