- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఆఫర్స్‌తో బిజీ బిజీగా ప్రీతీ ముకుందన్.. మరో స్టార్ హీరో సినిమాలో చాన్స్!
ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నటుడు అర్జున్‌కు కుమార్తెగా కనిపించిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.. యాక్షన్ సీన్లలో అదరగొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా.. తాజాగా వచ్చిన ‘హృదయం మురళి’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అంతే కాకుండా.. టైమ్ షెడ్యూల్ సెట్ అవ్వకపోవడంతో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ చిత్రంలో వచ్చిన ఆఫర్‌ను సైతం రిజెక్ట్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా మారిపోయిన ప్రీతి ముకుందన్ తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో చాన్స్ అందుకున్నట్లు టాక్. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ‘ఓం’, వెట్రిమార్ దర్శకత్వంలో ‘తమిళ మురుగన్’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్.. తన D56 కోసం కూడా సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీని ప్రీతి ముకుందన్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే కథ చర్చలు కూడా జరిగిపోగా.. దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తుండగా త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.






