మంత్రాలయ రాఘవేంద్రస్వామికి భారీగా ఆదాయం

by Vemula.Srinu Prasad |

మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో గత 22 రోజులకు భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు బుధవారం విజయవంతంగా పూర్తయింది..

మంత్రాలయ రాఘవేంద్రస్వామికి భారీగా ఆదాయం
X

దిశ, మంత్రాలయం: మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో గత 22 రోజులకు (జూన్ 23, 2026 నుండి జూలై 14, 2026 వరకు) భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు బుధవారం (జూలై 15, 2026) విజయవంతంగా పూర్తయింది. ఈ లెక్కింపు ద్వారా స్వామివారికి మొత్తం రూ. 3,71,35,259.ఆదాయం లభించిందని మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇందులో నోట్ల రూపంలో రూ. 3,60,37,959 రాగా, నాణేల రూపంలో రూ. 10,97,300 వచ్చాయి. నగదుతో పాటు భక్తులు స్వామివారికి 23 గ్రాముల బంగారం, 1085 గ్రాముల వెండిని కూడా కానుకలుగా సమర్పించుకున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ అంతా మఠం అధికారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా జరిగిందని ఆయన వెల్లడించారు

Next Story