- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు వైసీపీ కీలక సమావేశం
వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ..

దిశ,వెబ్ డెస్క్: వైసీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వైసీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు హాజరుకానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి అందాల్సిన నిధులపై పార్లమెంట్ ఉభయ సభల్లో గళమెత్తాలని ఎంపీలను ఆయన సూచించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను కూడా ఖరారు చేయనున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా...
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఉభయ సభల్లో బలంగా పోరాడాలని ఎంపీలకు వైఎస్ జగన్ సూచించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ వేదికగా జాతీయ స్థాయిలో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు జగన్ చెప్పనున్నారు.






