- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేళ్లచెరువులో నకిలీ డీఏపీ కలకలం..!
మేళ్లచెరువు మండలంలో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం కలకలం రేపింది.

దిశ, మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం కలకలం రేపింది. వేపల మాదారం గ్రామానికి చెందిన ఓ రైతు నకిలీ డీఏపీ ఎరువులను రైతులకు విక్రయిస్తున్నాడనే సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, అతని వద్ద ఉన్న పెద్ద మొత్తంలో డీఏపీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం అనుమానాస్పద ఎరువుల పై సంబంధిత డీఏపీ కంపెనీ ప్రతినిధులతో కలిసి తనిఖీలు నిర్వహించి, ఎరువుల నమూనాలను సేకరించారు. ప్రాథమిక పరిశీలనలో ఎరువులు నకిలీవిగా అనుమానం వ్యక్తం కావడంతో శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. మూడు రోజుల్లో ల్యాబ్ నివేదిక రానుండగా, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన పై వ్యవసాయ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నకిలీ డీఏపీ ఎక్కడి నుంచి వచ్చింది, సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు, రైతులకు ఎలా చేరిందనే అంశాల పై విచారణ కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే కొందరు రైతులు నకిలీ డీఏపీ బస్తాలను కొనుగోలు చేశారని వాటిని పొలాలకు ఉపయోగిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని. నమ్మకమైన డీలర్ వద్దని ఎరువులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.






